VZM: ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీ విగ్రహం నుంచి ఫోర్ట్ సిటీ సెంట్రల్ మాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. రోటరీ పూర్వ గవర్నర్ రామారావు, M.వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పోలియో నిర్మూలనే లక్ష్యంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, విజయ్ అగర్వాల్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.