JGL: బీర్ పూర్ మండలం మంగేళకి చెందిన లహరి అలియాస్ ప్రియాంకను సారంగాపూర్ మండలం కోనాపూర్‌కు చెందిన రాజేందర్‌కు ఇచ్చి వివాహం చేశారు. అదనపు వరకట్నం కోసం భర్త రాజేందర్ లహరిని వేధించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో భర్తపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నారాయణ నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించారు