MDK: హవేలి ఘనపూర్ మండలం పోచారం ప్రాజెక్టు వద్ద నీటి ఉధృతిని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు పరిశీలించారు. గురువారం సిబ్బందితో కలిసి సందర్శించారు. వాతావరణ శాఖ మెదక్ జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించ నేపథ్యంలో సందర్శన చేపట్టారు. పికెట్ విధుల్లో ఉన్న సిబ్బందికి పర్యాటకులను నీటి వైపు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.