AP: అసెంబ్లీలో బాలకృష్ణ ప్రవర్తనపై మాజీమంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. గతంలో బాలకృష్ణకు ‘మెంటల్ సర్టిఫికెట్’ ఇచ్చారని, ఇప్పుడు ఆయన తీరు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోందన్నారు. ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి కడుపున ‘సంస్కార హీనుడు’ పుట్టారని వ్యాఖ్యానించారు. బాలకృష్ణ ఇష్టానుసారం మాట్లాడుతుంటే మైక్ కట్ చేసేంత దమ్మున్నవారు సభలో ఎవరూ లేరని విమర్శించారు.