మాజీ CM జగన్కు CBI కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. జగన్ యూరప్ వెళ్లేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1-30 మధ్య యూరప్ వెళ్లేందుకు అనుమతించాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్పై CBI కోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం 15 రోజులు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. నవంబర్ 14లోపు జగన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని సూచించింది.