TG: హైదరాబాద్లోని SR నగర్ వద్ద మియాపూర్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డుపైనే ఆపి, ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. దీంతో కూకట్పల్లి నుంచి పంజగుట్ట మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.