ఆసియా కప్‌లో టీమిండియా ఫీల్డింగ్ పేలవంగా కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 5 క్యాచ్‌లు జారవిడిచారు. అయితే దుబాయ్ స్టేడియం రూఫ్ చుట్టూ ఉన్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ లాంటి లైటింగ్ దీనికి కారణమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ లైట్ల వల్ల హై క్యాచ్‌లు పట్టుకునేటప్పుడు ఫీల్డర్లు ఇబ్బంది పడుతున్నట్లు వారు చెబుతున్నారు.