W.G: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ సీఎం వై.ఎస్. జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పాలకొల్లు వైసీపీ ఇంఛార్జ్ గుడాల గోపి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జగన్ సూచించినట్లు గోపి తెలిపారు.