VSP: రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ బుధవారం సాయంత్రం విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు. మహిళా బ్యారేక్ను పరిశీలించి మహిళా ఖైదీలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పోషమ్మ పథకం అమలు చేస్తోందని, మహిళా ఖైదీలకు కూడా ఈ పథకం కింద ప్రత్యేక డైట్ ప్లాన్ అమలు చేసేలా పరిశీలిస్తున్నామని వివరించారు.