ప్రకాశం: పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో కనిగిరి పట్టణంలో థియేటర్ వద్ద ఫ్యాన్స్ సందడి చేశారు. బుధవారం రాత్రి పామూరు బస్టాండ్ నుంచి స్థానిక సుదర్శన్ థియేటర్ వరకు అభిమానులు ర్యాలీగా బయలు దేరారు. పవన్ కళ్యాణ్ ఫొటోకు పాలాభిషేకం చేసి రచ్చ చేశారు. థియేటర్ వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎస్సై మాధవరావు ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు.