VKB: జిల్లా SP నారాయణ రెడ్డి ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ CI అన్వర్ పాషా, బృందం తాండూర్ పట్టణంలో వాహనాలు తనిఖీ చేశారు. కర్ణాటక నుంచి జిల్లాకు గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. అతని వద్ద 1,100 గ్రాముల గంజాయి లభ్యమైంది. ఈ మేరకు తాండూర్ పట్టణంలో కేసు నమోదు చేశారు. జిల్లా టాస్క్ ఫోర్సు SP నారాయణ రెడ్డి అభినందించారు.