ASR: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో ముమ్మరంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని జీసీసీ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్ అన్నారు. శుక్రవారం కొయ్యూరు మండలంలోని మంప పంచాయతీలో ఎంపీపీ బడుగు రమేశ్, ప్రజా ప్రతినిధులతో కలిసి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జల జీవన్ మిషన్ ద్వారా రూ.20లక్షల 80వేలతో వాటర్ ట్యాంక్ మంజూరైనట్లు తెలిపారు.