శ్రీకాకుళంలోని నెహ్రూ యువ కేంద్రంలో అక్టోబర్ 7న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పూల్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి సాయికుమార్ శుక్రవారం తెలిపారు. ఈ క్యాంపస్ డ్రైవ్లో ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో పదవ తరగతి అర్హతతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. 18 సంవత్సరాల వయసు నిండిన వారు అర్హులని పేర్కొన్నారు.