TG: దసరా సందర్భంగా RTC బస్సుల్లో ప్రయాణించే వారికి బహుమతులు ఇస్తామని TGSRTC ప్రకటించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్కి ముగ్గురు చొప్పున 33 మందికి రూ.5.50 లక్షల విలువ గల బహుమతులను సంస్థ అందజేయనుంది. ఈ నెల 27నుంచి అక్టోబర్ 6 వరకు ఈ ఆఫర్ ఉండనుంది. బస్సు ప్రయాణం అనంతరం టికెట్ వెనకాలు పేరు, ఫోన్ నంబర్ రాసి బస్టాండులో ఏర్పాటు చేసిన లక్కీ డ్రా బాక్సులో వేయాలి.