KRNL: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2,4వ సెమిస్టర్ ఫలితాలను యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు గురువారం విడుదల చేశారు. యూజీ రెండో సెమిస్టర్లో 541 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 151 మంది పాసయ్యారు. యూజీ నాలుగో సెమిస్టర్లో 781 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 196 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఆయన తెలిపారు.