AKP: కశింకోట అమిరపల్లి వీధిలో ఓ ఇంటిలో ఈ ఏడాది జనవరి 1వ తేదీన 15 తులాలు బంగారం దొంగలించిన నిందితుడు కరక రాజబాబును గురువారం అరెస్టు చేసినట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు. మండలంలో అచ్చెర్ల వద్ద నిందితుడిని అరెస్టు చేసి 8 తులాలు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు 30 దొంగతనాలు కేసులో 15 సార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు సిఐ తెలిపారు.