KRNL: రబీ సీజన్ ప్రారంభమైనా, పప్పుశనగ విత్తనాలను సబ్సిడీ ధరలకు రైతులకు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆలూరు MLA విరూపాక్షి గురువారం ఆరోపించారు. హాలహర్వి, చిప్పగిరి ప్రాంతాల్లో పప్పుశనగ సాగు ఎక్కువగా జరుగుతుందని, గత YCP ప్రభుత్వం సకాలంలో విత్తనాలు అందించేదని ఆయన తెలిపారు. వెంటనే సబ్సిడీ విత్తనాలు అందించకపోతే ఆందోళనలు చేపడతామన్నారు.