VSP: విశాఖలో పేదల బడ్డీల తొలగింపు పేదరిక నిర్మూలన కార్యక్రమానికి వ్యతిరేకమని యూపీఎస్సీ మాజీ ఛైర్మన్, ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ కె.యస్.చలం జీవిఎంసీ కమిషనర్‌కు లేఖ రాశారు. బడ్డీలు తొలగిస్తే కూలీలు, విద్యార్థులు ఇబ్బందిపడతారని, ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. పూర్ణామార్కెట్ పరిసరాల్లో వీలుగా స్ట్రీట్ వెండర్స్‌కు స్థలం ఇవ్వాలన్నారు.