MDK: యూట్యూబ్ ఛానల్స్ పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూప్రాన్ పట్టణ ఆస్పత్రిలో మొక్కలు నాటిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ వద్ద జీతాలు తీసుకుని ఆ ఛానల్స్ పనిచేస్తున్నాయని ఆరోపించారు. అంతేకాకుండా తాను కాంగ్రెస్ను విమర్శించడం లేదని ఆ ఛానల్స్ పేర్కొనడాన్ని తప్పుపట్టారు.