VZM: గంట్యాడ మండలం కొండతామరపల్లి గ్రామంలో వెలసిన శ్రీ పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవంలో భాగంగా సిరిమాను చెట్టును జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసరావు కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర బుధవారం దర్శించుకున్నారు. అనంతరం సిరిమానుకు పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.