ATP: కంబదూరు నుంచి పేరూరు వరకు 14 కి.మీ రెండు వరుసల బీటీ రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ.23 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన పనులను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు చొరవ తీసుకుని మళ్లీ ప్రారంభించారు. ఈ రోడ్డు పూర్తయితే ప్రజలు, వాహనదారులకు ప్రయాణాలకు సౌకర్యంగా మారనుంది.