మజ్జిగలో అల్లం రసం కలిపి తాగితే అనేక లాభాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి, అసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అల్లం వల్ల జీర్ణ వ్యవస్థలో ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. దీని వల్ల గ్యాస్ తొలగిపోతుంది.