ADB: భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి గ్రామానికి చెందిన శ్రీరామోజీవార్ అనిల్ శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో గాయాల పాలయ్యాడు. ఆదిలాబాద్ నుంచి గ్రామానికి వెళ్లే క్రమంలో ఘోట్కూరి సమీపంలోని మార్గమధ్యంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి గాయాల పాలైనట్లు స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాల పాలైన ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.