SRPT: మునగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత రికార్డులను పరిశీలించారు. అనంతరం మందుల గదిని తనిఖీ చేసి, సరిపడగా మందులు ఉన్నాయా లేవా అని ఆరా తీశారు. ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్య అధికారి రవీందర్‌ను ఆదేశించారు.