GNTR: కొల్లిపర మండలం అన్నవరపు లంక, నదీ పరివాహక గ్రామాలలో తెనాలి MRO గోపాలకృష్ణ పర్యటించారు. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉండటంతో లంక గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. వరద ముంపు నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.