శరీరంలోని ఖనిజాలు, ద్రవాల సమతుల్యతను మూత్రపిండాలు కాపాడుతాయి. అయితే అధిక మొత్తంలో కాల్షియం, ఆక్సలేట్ లేదా యూరిక్ యాసిడ్ మూత్రంలో పేరుకుపోయినప్పుడు.. అవి స్పటికీకరించబడి క్రమంగా కిడ్నీ స్టోన్లను ఏర్పరుస్తాయి. చాలా తక్కువ నీరు తాగడం, ఎక్కువ ఉప్పు లేదా ప్రోటీన్ తీసుకోవడం, జీవనశైలి లోపాలు, జన్యుపరమైన కారకాల వల్ల రాళ్లు ఏర్పడవచ్చు.