ప్రకాశం: గిద్దలూరులో గురువారం ఫర్నిచర్ షాప్ యజమాని సురేంద్రపై రమణ కత్తెరతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. లక్షన్నర విలువైన ఫర్నిచర్ కొనుగోలు చేసిన రమణ రూ. 20,000 చెల్లించి మిగిలిన డబ్బు చెల్లించడంలో జాప్యం చేశాడు. అప్పు తిరిగి చెల్లించమని సురేంద్ర నిలదీయడంతో ఆగ్రహించిన రమణ ఈ దాడికి పాల్పడ్డాడు. గాయపడిన సురేంద్రను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.