సీతాఫలం తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి. దీనిని ‘పోషకాల ఘని’ అని కూడా అంటారు. వీటిల్లో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి.. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.