మంచిర్యాల: ప్రజా రక్షణకు పోలీసులు పని చేస్తున్నారని దండేపల్లి మండల పోలీసులు అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా గురువారం దండేపల్లి పోలీస్ స్టేషన్ను విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసుల విధులు, రికార్డులు, తదితర అంశాలను విద్యార్థులకు పోలీసులు వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల ముఖ్య విధి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసులు ఉన్నారు.