MBNR: జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి నెల వారి నేర సమీక్షను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. క్రైమ్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. దర్యాప్తు నాణ్యతను మెరుగుపరిచి దోషులకు శిక్షపడేలా చేయాలన్నారు.