ADB: శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని బేల ఎస్సై ప్రవీణ్ కుమార్ అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అంకుష్, దీపక్, రాకేష్, గణేష్ తదితరులున్నారు.