SRD: సిర్గాపూర్ మండలంలోని కడపల్ దాసాంజనేయ స్వామి ఆలయానికి చెందిన ఆవు (గోమాత) శనివారం ఉదయం తండాలో మృతి చెందింది. విషయం తండావాసుల విజ్ఞప్తి మేరకు గ్రామస్తులు ఆవుకు అక్కడే అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో మృతి చెందిన గోమాతకు సాంప్రదాయ పద్ధతిన పూజలు చేసి వస్త్రం, పూలు సమర్పించారు. భక్తి గీతాలు ఆలపించి, అనంతరం గోమాతకు ఖననం చేశారు.