W.G: కార్తీకమాసం సందర్భంగా భీమవరం మెంటే వారి తోటలోని శ్రీబాలత్రిపుర సుందరి అమ్మవారికి 150 కమల ఫలాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఇవాళ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు కొమ్ము శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమెరికాకు చెందిన గంటా బాలాజీ, శిరీషా దంపతుల సహకారంతో ఈ అలంకరణ జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.