NGKL: బిజినేపల్లి మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కంతం లక్ష్మయ్య (55) శనివారం ఆకస్మికంగా మృతి చెందాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో లక్ష్మయ్య చురుకుగా పాల్గొన్నారు. బిజినేపల్లి మండలంలో తొలి తెలంగాణ ఉద్యమకారుడిగా అతడికి పేరు ఉంది. ఆయన మరణంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.