WGL: కార్తీక దీపోత్సవాన్ని కనుల పండగలా నిర్వహించాలని, రాష్ట్రంలోని ప్రతి దేవాలయం దీపాలతో అలంకరించాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. కార్తీక దీపోత్సవం ఈనెల 22 నుంచి వచ్చేనెల 19 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. కార్తీకమాసం సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.