AKP: నాగుల చవితి పండుగ వేడుకలను నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్, కుటుంబ సమేతంగా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం సమీపంలోని పుట్టలో పాలు గుడ్లు వేసి నాగేంద్రునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు నాగులచవితి శుభాకాంక్షలు తెలియజేశారు.