ASR: వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని డీఎంహెచ్వో కృష్ణమూర్తి తెలిపారు. శనివారం కిల్లొగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సున్నమెట్ట గ్రామాల్లో ఆయన పర్యటించి వైద్య సిబ్బందిని సూచనలు చేశారు. గ్రామస్తుల ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరాలు వచ్చిన వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.