తిరుపతి నియోజకవర్గ పరిధిలో 1,200 కంటే ఎక్కువ ఓట్లు కలిగిన కేంద్రాలను విభజించేందుకు సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి ఎన్. మౌర్య సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతిపాదనలను పరిశీలించారు.