ప్రకాశం: పొన్నలూరు మండలంలోని ఇప్పగుంట ,పెద్ద వెంకన్న పాలెం చెరువులను డిప్యూటీ తాహసీల్దార్ స్రవంతి, ఎంపీడీవో సుజాత శనివారం పరిశీలించారు. తుఫాన్ కారణంగా మండలంలోని అన్ని చెరువుల వద్ద భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమములో పంచాయితీ సెక్రటరీలు నారాయణ, భారతి, వెంకటేశ్వర నాయక్, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.