ELR: గణపవరం గ్రామంలో వెంకయ్యవయ్యేరు కాలువపై ఉన్న R&B వంతెన శిధిలావస్థకు చేరుకోవటంతో ఇవాళ MLA పత్సమట్ల ధర్మరాజు వంతెన స్థితి గతులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్బంగా వంతెనపై నుంచి దిగువ నుంచి శిధిలమైన ఫుట్ పాత్, రైలింగ్, స్లాబ్ దిగువ భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వంతెన మరమ్మతు పనులకు సంబంధించి తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు.