AKP: ఈవీఎం గోదాముల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీఆర్వో వై.సత్యనారాయణరావు సిబ్బందిని ఆదేశించారు. శనివారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద గల ఈవీఎం గోదాములను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు, గోదాము ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. భద్రత ప్రమాణాలపై సిబ్బందికి అధికారులకు తగిన సూచనలు చేశారు.