WGL: మహిళా కాంగ్రెస్ను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి, క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం లక్ష్యంగా మండల మహిళా అధ్యక్షురాలు మరుపట్ల అరుణ సాయికుమార్ పేర్కొన్నారు. శనివారం వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ ఆదేశాల మేరకు కొత్తగా గ్రామ మహిళా కాంగ్రెస్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నికచేశారు.