HYD: కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడంలో విఫలమైందని డీవైఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఏ.ఏ. రహీం అన్నారు. చిక్కడపల్లిలో జరిగిన డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని, నిరుద్యోగం విపరీతంగా పెరుగుతోందని విమర్శించారు. ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.