AKP: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా వాతావరణ శాఖ హెచ్చరికలతో ఈనెల 26 నుంచి 28 వరకు పరవాడ మండలంలో ముత్యాలమ్మ పాలెం, తిక్కవానిపాలెం తీరప్రాంతాల్లో అనుమతిని నిషేధించినట్లు పరవాడ సిఐ మల్లికార్జునరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈదురు గాలులతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.