ASR: సహజ సిద్ధ ప్రకృతి అందాలకు మన్యం పుట్టినిల్లు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ప్రకృతి రమణీయ దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఈక్రమంలో పాడేరును ఆనుకుని తూరుపు కొండల్లో మనోహర దృశ్యం ఆవిషృతమైంది. పచ్చని పంట పొలాలు, పుడమిని తాకుతున్న లేలేత సూర్య కిరణాలు, దోబూచులాడుతున్న మంచు మేఘాలు కలగలిపిన సహజ సుందర దృశ్యం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది.