ATP: రైతులు సాగు చేసిన పత్తిని కొనుగోలు చేసేందుకు భారతీయ పత్తి సంస్థ ద్వారా స్థానిక మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు గుత్తి మండల వ్యవసాయ అధికారి ముస్తాక్ ఆహ్మద్ శనివారం తెలిపారు. పింజపొడువును బట్టి మద్దతు ధర నిర్ణయించామని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రంలో విక్రయించుకోవాలన్నారు.