KMR: నాగిరెడ్డిపేట్ మండలం కిచ్చన్నపేట సొసైటీ డైరెక్టర్లపై అనర్హత వేటు పడింది. తమ తప్పు లేకున్నా, కావాలని నిందమోపి తప్పుడు ఆరోపణలతో తొలగించారని సొసైటీ ఉపాధ్యక్షులు బాబురావు, జలాల్పూర్ గ్రామ డైరెక్టర్ సిద్ధిరాంరెడ్డి, సంగయ్యలు ఆరోపించారు. డైరెక్టర్ పదవిని పునరుద్ధరించాలని కోరుతూ శనివారం NZB జిల్లా సహకార బ్యాంకు డీసీవోకు వినతి పత్రం అందజేశారు.