ATP: గృహ నిర్మాణ శాఖపై ఎమ్మెల్యే పరిటాల సునీత సమీక్ష నిర్వహించారు. స్వంత స్థలం కలిగి ప్రభుత్వం ద్వారా ఇళ్లు నిర్మించుకునే వారికి పొజిషన్ సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సర్వే నవంబర్ 5లోగా పూర్తి చేయాలని సూచించారు. ఇళ్లు నిర్మించుకోని వారికి పట్టాలు రద్దు అంశంపై చర్చించారు.