KMR: శనివారం పాత బాన్సువాడకు చెందిన 25 ఏళ్ల వివాహిత మురగల్లా బాలమణి ఇంట్లోంచి బయటకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. ఆమె తండ్రి మురగండ్ల బాలయ్య ఫిర్యాదు మేరకు బాన్సువాడ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు. బాలమణి ఆచూకీ తెలిస్తే బాన్సువాడ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు.