VZM: స్వర్ణ పంచాయతీ యాప్‌పై గ్రామస్థులకు అవగాహన కల్పించాలని రాజాం డిప్యూటీ MPDO శ్రీనివాసరావు సూచించారు. శనివారం స్థానిక గడిముడుదాంలో స్వర్ణ పంచాయితీ యాప్‌కు గ్రామస్టుల మొబైల్ నంబర్లను లింక్ చేస్తున్నట్లు తెలిపారు. ఇంటి, ఇతరత్రా పన్నులు చెల్లింపులను ఆన్లైన్ ద్వారా చేయచ్చన్నారు. పంచాయతీల ఆర్థిక లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించవచ్చన్నారు.